
ప్రజా ఆశీర్వాద సభాస్థలిని పరిశీలిస్తున్న పోలీసులు, నాయకులు
శాంతినగర్: సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభాస్థలాన్ని పోలీసు అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈ నెల 19న ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభకు హాజరుకానున్నారు. సమావేశానికి 50 వేల మందికి పైగా హాజరవుతారనే లక్ష్యంతో అందరూ కూర్చోడానికి అవసరమైన స్థలాన్ని బీఆర్‌ఎస్ నేతలు, పోలీసులు పరిశీలించారు. శాంతినగర్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయం వెనుక భాగంలోని పొలాల్లో 20 ఎకరాల స్థలాన్ని సభా నిర్వహణకు ఎంపిక చేశారు. అంతేగాక సభకు హాజరయ్యే వారికి అవసరమైన ఏర్పాట్ల గురించి స్థానిక నేతలు చర్చించుకున్నారు. కార్యక్రమంలో శాంతినగర్ సీఐ శివశంకర్‌గౌడ్, ఎస్‌ఐ నరేష్, వడ్డేపల్లి, రాజోళి మండలాల బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ పుల్లూరు నాగేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, మాణిక్యారెడ్డి, సూరి, భార్గవ్, మున్సిపల్ చైర్మన్ కరుణ, భాస్కర్‌రెడ్డి, నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభాస్థలిని పరిశీలించిన అధికారులు, నాయకులు