
స్వతంత్రులు.. ఆ నలుగురు
మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలో కలిసి ఉన్న కొడంగల్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ల పరంగా ఓ రికార్డు ఉంది. ఈ సెగ్మెంట్‌లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 1962 ఎన్నికల్లో రుక్మారెడ్డి, 1967లో అచ్యుతారెడ్డి, 1972లో సందారం వెంకటయ్య, 1978లో గుర్నాథ్‌రెడ్డి స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇందులో గుర్నాథ్‌రెడ్డి 1983, 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలవగా.. నందారం వెంకటయ్య 1985లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కాగా.. ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర, అచ్చంపేట, వనపర్తి, నారాయణపేట నియోజకవర్గాల నుంచి స్వతంత్రలెవరికీ ఇంత వరకు విజయం దక్కలేదు.
ఎన్నికలంటే పెద్ద తతంగం.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలనుకునేవారు రెండు, మూడేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడం.. కార్యకర్తలు, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం.. మంచీచెడు చూసుకోవడం వంటివి చేస్తూ కేడర్‌పై పట్టు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇదంతా పూర్తయ్యాక ఎన్నికల వేళ పార్టీ టికెట్ వస్తుందో లేదో తెలియదు. అప్పటికప్పుడు కొత్త నేతలు వస్తే సమీకరణల నేపథ్యంలో వారికే టికెట్ దక్కవచ్చు. అదే జరిగితే రెండు, మూడేళ్ల కష్టం వృథా అయినట్లే. అధిష్టానాల నుంచి భవిష్యత్‌పై స్పష్టమైన హామీ వస్తేనే గెలుపు ఖాయమనే భావనతో కొందరు పోటీకి సై అంటుంటారు. మరికొందరు ఏదో పార్టీ నుంచి పోటీకి దిగడం ఇష్టం లేక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతుంటారు.
– నాగర్‌కర్నూల్
పార్టీల మద్దతు లేకుండా ఎమ్మెల్యేలుగా గెలుపు
పరిస్థితులు అనుకూలించక కొందరు.. పార్టీ అండ వద్దని మరికొందరు
కొన్నిచోట్ల బోణి చేయలేకపోయిన ఇండిపెండెంట్లు

పులివీరన్న,మహబూబ్‌నగర్

డీకే సత్యారెడ్డి, గద్వాల

ఎడ్మ కిష్టారెడ్డి,కల్వకుర్తి

కె.రంగదాసు,కొల్లాపూర్