
విద్యాశాఖ అధికారులతో కళాఉత్సవ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
గద్వాల అర్బన్: విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కళాఉత్సవ్ పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. ఈ పోటీలకు డీఈఓ సీరాజుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళ రంగాల్లో రాణించాలని సూచించారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జానపద, శాసీ్త్రయ పాటలు, నృత్యాలు, త్రీడీ చిత్రలేఖనం, వాయిద్య తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు ఏస్తేరురాణి, హంపయ్య, మాధవి, సుజాత, జయప్రకాష్, కృష్ణ, రామాంజనేయలు పాల్గొన్నారు.