● అత్యధికంగా రూ.68 వేల అద్దెకి దుకాణం కేటాయింపు
గట్టు: గట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గ్రామపంచాయతీ దుకాణాలకు వేలం పోటాపోటీగా కొనసాగింది. శనివారం గట్టు గ్రామపంచాయతీలో 9 దుకాణాలకు వేలం నిర్వహించారు. 7 పెద్దవి, 2 చిన్న దుకాణాలున్నాయి. పెద్ద వాటికి రూ.50 వేలు, చిన్న వాటికి రూ.40 వేలను డిపాజిట్లను అధికారులు స్వీకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో వేలం నిర్వహించారు. ఎంపీఓ సయిద్‌ఖాన్, సర్పంచ్ ధనలక్ష్మి, గట్టు–1, 2 ఎంపీటీసీలు మహేశ్వరి, కృష్ణ, కార్యదర్శి జగన్నాథరావుల ఆధ్వర్యంలో వేలం కొనసాగింది. మొత్తం 9 దుకాణాలకు 71 మంది పోటీపడ్డారు. ఇందులో అత్యధికంగా రెండో నంబర్ దుకాణానికి రూ.68,000కు వేలం పాడి దేవన్న అనే వ్యక్తి దక్కించుకున్నాడు. అయిదో నంబర్ దుకాణానికి రూ.38,500కు వెంకట్రాములు దక్కించుకున్నాడు. 1వ దుకాణం రూ.5,500లకు అయ్యప్ప, మూడో నంబర్ దుకాణం రూ.9,500కు శరణప్ప, నాలుగో నంబర్ దుకాణం రూ.30 వేలకు మహబూబ్‌పాష, ఆరో నంబర్ దుకాణం రూ.30 వేలకు ఖాజామోహినొద్దీన్, ఏడో నంబర్ దుకాణం రూ.14 వేలకు బలిజ శివరాజు, 8వ నంబర్ దుకాణాన్ని రూ.14 వేలకు వీరన్న, 9వ నంబర్ దుకాణాన్ని రూ.9,300కు వెంకటేష్ వేలంలో దక్కించుకున్నారు. దుకాణాలను దక్కించుకున్న వారి నుంచి డిపాజిట్‌గా రూ.50 వేలను అధికారులు స్వీకరించారు.