ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు

Mar 18 2023 1:34 AM | Updated on Mar 18 2023 1:34 AM

గద్వాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న 
హృదయరాజు  - Sakshi

గద్వాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న హృదయరాజు

గద్వాల: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు ముందుస్తుగా తెలియజేయడంతో విద్యార్థులు దాదాపు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇంగ్లిష్‌ పరీక్షకు మొత్తం 4,399 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 4,178 మంది విద్యార్థులు హాజరయ్యారు. 221 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్‌ జనరల్‌ విభాగంలో 3,672 మంది విద్యార్థులకు గాను 3,496 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఒకేషనల్‌ విభాగంలో 727 మంది విద్యార్థులకు గాను 682 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను ఇంటర్‌ విద్యా జిల్లా అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు 144 సెక్షన్‌ను ఆయా కేంద్రాల వద్ద అమలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement