
వేలందారులకు ఆర్డర్ కాపీలు అందజేస్తున్న కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల రూరల్: రాజీవ్ స్వగృహ కాలనీ(అంబర్ టౌన్‌షిప్)లోని 54 ప్లాట్లకు కలెక్టర్ నేతృత్వంలో స్థానిక హరితహోటల్‌లో బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వేలందారులు 54 ప్లాట్లకు గాను 43 ప్లాట్లను దక్కించుకున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. వేలంలో పాల్గొన్న వేలందారులు స్క్వైర్ ఫీట్‌కు గరిష్టంగా రూ.11,500, కనిష్టంగా రూ.5,600 చొప్పున వేలం జరిగిందన్నారు. దీని ద్వారా మొత్తం రూ.8.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. బహిరంగ వేలంలో ప్లాట్లు దక్కించుకున్న వేలందారులకు ప్లాట్ల ఆర్డర్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజు, డీపీఓ శ్యాంసుందర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
54కు గాను
43 విక్రయం
రూ.8.85 కోట్ల ఆదాయం