
అవగాహన కల్పిస్తున్న మత్స్య కళాశాల ప్రొఫెసర్లు
పెబ్బేరు: చేపల పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చని మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని మత్స్య కళాశాల ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి పెంచడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఐదో రోజు శిక్షణలో చేపల పెంపకం, రవాణా, మార్కెటింగ్, బ్యాగ్ ఫీడింగ్ పద్ధతి, మగ, ఆడ చేపల గుర్తింపు, తదితర అంశాలపై వివరించి అవగాహన కల్పించారు. రైతులందరూ చిన్న తరహాలో చేపల పెంపకం ప్రారంభించాలని, చెరువుల నిర్మాణం, చేప విత్తనాల నిల్వ, దాణా నిర్వహణపై నైపుణ్యత సాధించాలన్నారు. కార్యక్రమానికి ప్రొఫెసర్లు డాక్టర్ ముత్తప్పకవి, మదనాపురం కేవీకే కో ఆర్డినేటర్ బాలాసాహెబ్ జోగ్రే హాజరయ్యారు.