
గద్వాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్నడీఐఈఓ హృదయరాజు
గద్వాల: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు ముందుస్తుగా తెలియజేయడంతో విద్యార్థులు దాదాపు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 3,912 మంది విద్యార్థులు పరీక్షక్ష రాయాల్సి ఉండగా 3,734 మంది విద్యార్థులు హాజరయ్యారు. 178 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్యా జిల్లా అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 144 సెక్షన్‌ను ఆయా కేంద్రాల వద్ద అమలు చేశారు.