ఏడాదిన్నరగా ఎదురుచూపు | - | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నరగా ఎదురుచూపు

Oct 31 2025 7:51 AM | Updated on Oct 31 2025 7:51 AM

ఏడాది

ఏడాదిన్నరగా ఎదురుచూపు

ఏడాదిన్నరగా ఎదురుచూపు పాలకవర్గంపై సమాచారం లేదు

కొనసాగుతున్న జాప్యం..

కాళేశ్వరం ట్రస్టుబోర్డు

ఏర్పాటులో జాప్యం

కాళేశ్వరం: కాళేశ్వరం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్థానిక ఎన్నికల తరువాతే నియామకం జరుగుతుందని ఆశించినప్పటికీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఆశావహులకు నిత్యం మంత్రి శ్రీధర్‌బాబు చుట్టూర ప్రదక్షిణలు తప్పడం లేదు. ప్రభుత్వం పాలకవర్గానికి నోటిఫికేషన్‌లు వేయడం, రద్దు చేస్తుండడంతో ఆశావహులు, భక్తులు అయోమయంలో పడుతున్నారు.

పెరిగిన ఆదాయం..

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒకటి. కాళేశ్వరాలయం వార్షికాదాయం రూ.6కోట్లకు చేరింది. దీంతో ఇటీవల దేవాదాయశాఖ 6ఏ ఆలయం నుంచి ఏసీ(అసిస్టెంట్‌ కమిషనర్‌) హోదా పెంపుపై ఈఓకు పత్రాలు అందించారు. దీంతో ఆదాయ, వ్యయాలు, ఉద్యోగుల సంఖ్య, ఇతర వ్యవహారాలన్నీ కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. ఏసీ హోదా పెరిగితే క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ఉద్యోగులు, ఇతర సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రస్తుతం గ్రేడ్‌–2 ఈఓ ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండగా.. ఏసీ స్థాయి పెరిగితే ఐఏఎస్‌ స్థాయి అధికారి ఈఓగా వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ఆలయ అభివృద్ధి జరగనుంది. ఆ స్థాయిలో ఉండే చైర్మన్‌, పాలకవర్గం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి శ్రీధర్‌బాబు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.

3వ సారి కూడా..

ఆగస్టు 21న రీ నోటిఫికేషన్‌కు దేవాదాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 14మంది డైరెక్టర్లు, ఒక ఎక్స్‌అఫీషియో మెంబర్‌(అర్చక)తో 15 మంది సభ్యులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో 20 రోజు ల గడువుతో ఆశావహులు దరఖాస్తు చేశారు. వా రిపై పోలీసు విచారణ కూడా పూర్తి చేశారు. సుమారుగా 30మంది వరకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ పాలకవర్గం నియామకంపై ఎ లాంటి ఉత్తర్వులు రాకపోవడంతో మూడవసారి కూడా నీలినీడలు వెంటాడుతున్నాయి. త్వరగా పా లకవర్గం నియమిస్తే ఆలయ అభివృద్ధి జరిగి, ఆ లయ వ్యవస్ధ బాగుపడుతుందని భక్తుల నమ్మకం.

అస్తవ్యస్తంగా..

అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులకు మధ్య సమన్వయ లోపం ఉంది. వారిపై అజమాయిషీ చేసి భక్తులకు సేవలందించే పాలకవర్గం లేకపోవడంతో ఇష్టారీతిన ఆలయ వ్యవస్థ కుంటుపడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ సమయ పాలనపై పట్టింపు లేదు.

కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం ఏర్పాటుపై మాకు సమాచారం లేదు. ఆశావహులు దరఖాస్తులు చేశారు. వారిపై పోలీసు విచారణ జరిగింది. ఎప్పుడు ఉత్తర్వులు వస్తాయనేది తెలియదు.

– ఎస్‌.మహేష్‌, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు నియామకానికి దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌ వేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా 40 వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దుచేశారు. తరువాత ఈ ఏడాది జనవరి 5న ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మళ్లీ రీ నోటిఫికేషన్‌ను దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆశావహుకులు 90కి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన కుంభాభిషేకానికి ట్రస్టుబోర్డు వేస్తారని ఆశించి భంగపడ్డారు. అదే నెలలో ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఈ రెండు ఉత్సవాలకు ట్రస్టుబోర్డు ఉంటుందని సంబరపడ్డ నేతలకు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డు తగిలింది.

రూ.6కోట్లకు ఆలయ వార్షికాదాయం

3వ సారీ ఆశావహులకు నిరాశేనా..

ఏడాదిన్నరగా ఎదురుచూపు1
1/1

ఏడాదిన్నరగా ఎదురుచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement