 
															కదిలిస్తే కన్నీరే..
జిల్లాలో పంటలు వర్షార్పణం
● అన్నదాతలను ముంచేసిన మోంథా తుపాను
● వరి, పత్తి, మిరప పంటలకు నష్టం
మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీవర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంట కళ్లముందే వర్షార్పణమైంది. వరిచేలు నీట మునిగాయి. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి రాలిపోవడమే కాకుండా నల్లబడిపోయింది. మిరప పంటకూ తీవ్ర నష్టం వాటిల్లింది. భారీవర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆరుగాలం శ్రమించి కష్టపడి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
