నియామకం
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గడ్డం రాధాకృష్ణను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజన్న బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాధాకృష్ణ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి అప్పగించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయస్థాయి
క్రీడాపోటీలకు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి స్టాలిన్‌నాయక్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుత్నున స్టాలిన్‌నాయక్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్‌లో, క్రాస్ కౌంట్రీ రేస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎన్నికై నట్లు వెల్లడించారు. 2026 ఫిబ్రవరిలో హరియాణాలోని రోహతక్‌లో జరిగే పోటీలో పాల్గొననున్నట్లు ఇన్‌చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తెలిపారు.
హారతి వేదికకు గొడుగు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతీనది పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్ వద్ద దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇవ్వడానికి ఏడు వేదికలు నిర్మించిన విషయం తెలిసిందే. ఏడు వేదికలపై తొమ్మిది హారతులు పండితులచే ఇచ్చేందుకు పుష్కరాల సమయంలో గద్దెలు నిర్మించగా, పూర్తిస్థాయిలో పైన గొడుగులు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయలేదు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అప్పటి నుంచి ప్రతీ రోజు గోదావరి హారతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కాగా, మిగిలిన పనులను పూర్తి చేయడానికి గద్దెలపై ఇనుప రాడ్డులతో గొడుగు, ఇతర పరికరాలు కాళేశ్వరం చేరాయి. రెండు రోజుల్లో పనులు ప్రారంభం అవుతున్నాయని ఈఓ మహేష్ బుధవారం తెలిపారు.
శెభాష్.. విద్యుత్ ఉద్యోగులు
భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు డీసీసీ బ్యాంకు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులు బుధవారం రాత్రి వర్షంలోనూ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి సరఫరా పునరుద్ధరించారు. దీంతో పట్టణవాసులు, వ్యాపారులు తదితరులు.. విద్యుత్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. లైన్‌మన్ దేవేందర్‌రెడ్డి, ఏఎల్‌ఎంలు మహేష్, రవి, ఉమాన్ ఉన్నారు.
రామప్పను సందర్శించిన జీఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ జనరల్ ఎల్‌పీ సింగ్ బుధవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట జీఎస్‌ఐ డైరెక్టర్ మంజు, గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
జాతర పనులకు ఆటంకం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వర్షంతో మేడారం జాతర అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పనులు నిలిచిపోయాయి. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం(ప్రహరీ), మేడారంలో రోడ్ల విస్తరణ, డ్రైయినేజీ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. వర్షం ఇలాగే మరో రెండురోజులు పడితే జాతర అభివృద్ధి పనులు నిచిపోయి పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
నియామకం
నియామకం
నియామకం


