‘దామిని’తో అప్రమత్తం
రేగొండ: రైతులు తమ పంట పొలాల్లో సాగు చేస్తున్న క్రమంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడే సమయంలో పిడుగులు పడి ప్రాణాలు కోల్పోతుంటారు. పిడుగుపాటును ముందే గ్రహించి అప్రమత్తమై ప్రాణపాయం నుంచి తప్పించుకునేందుకు భారత వాతావరణ శాఖ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న భారతీయ ఉష్ణ మండల శాసీ్త్రయ మెటారాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐటీఎం–పూణే), భూ వ్యవస్థ విజ్ఞాన సంస్థ (ఈఎస్‌ఎస్‌ఓ) ద్వారా దామిని యాప్‌ను అభివృద్ధి చేశారు.
యాప్ పని విధానం
దామిని యాప్ జీపీఎస్ లోకేషన్ ఆధారంగా పని చేస్తుంది. మీరు పని చేసే ప్రాంతానికి గరిష్టంగా 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉంటే ముందే నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ సమాచారం మూడు గంటల ముందుగానే అలెర్ట్ రూపంలో రావడంతో పిడుగుపాటుతో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
రంగుల సంకేతం ఇలా..
ఎరుపు రంగు : ఏడు నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.
పసుపు రంగు : మరో 10 –15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది.
నీలం రంగు : 15 – 25 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే సర్కిల్ నీలం రంగులోకి మారుతుంది.
ఎలా ఉపయోగించాలంటే..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో దామిని లైటింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ పిన్‌కోడ్‌తో రిజిష్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లోకేషన్ తెలుసుకునేందుకు యాప్‌కు అనుమతివ్వాలి. మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు వీలుగా మూడు రంగులను చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరున్నచోట ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తోంది.
పిడుగుపాటును ముందే గుర్తించే
ప్రత్యేక యాప్
యాప్‌లో మూడు రంగుల ద్వారా
సంకేతాలు


