పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఎఫ్‌ఏక్యూ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై బుధవారం ఆయన కలెక్టరేట్‌లో రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు ఎఫ్‌ఏక్యూ నిబంధనలు అనుసరించి కొనుగోలు చేపట్టాలన్నారు. ఈ సీజన్‌లో 44,396 హెక్టార్లలో వరి పంట సాగు అయిందని.. దాదాపు 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చ అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులు, మిల్లర్లకు సూచించారు. కొనుగోలు జరిగిన వెంటనే ఏపీఎంలు, సహకార సంఘాల సీసీలు రైతుల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలని, గరిష్టంగా 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉద్యాన పంటలపై అవగాహన పెంచాలి
జిల్లాలో ఉద్యాన పంటలపై మరింత అవగాహన పెంచాలని, రైతులకు సాంకేతిక సమాచారం సమయానుకూలంగా చేరేలా ఉద్యానదర్శిని పుస్తకాలు ఉపయోగపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులకు ఉద్యాన దర్శిని పుస్తకా లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతులకు ఆధునిక పద్ధతులు, పంట సంరక్షణ, మార్కెట్ సదుపాయాలు, రాయితీల వివరాలు క్షేత్రస్థాయిలో విస్తరణాధికారులు రైతులకు తెలియజేయాలన్నారు. ఉద్యానదర్శిని పుస్తకంలోని సమాచారాన్ని గ్రామస్థాయికి చేర్చి ప్రతి రైతును ప్రయోజనవంతులను చేయాలని సూ చించారు. డీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకా ర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కోఆపరేటివ్ అధికారి వాలియా నాయక్ మాట్లాడుతూ.. ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు గౌరవ ఏపీసీ నిర్దేశించిన విధంగా 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మండలాల వారీగా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు పథకాల లక్ష్యాలు, రాయితీలు, ప్రయోజనాలు, రైతులకు అందే లబ్ది గురించి ప్రజెంటేషన్ రూపంలో వివరణ ఇచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌరసరఫ రాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్, వ్యవసాయ అధికా రి బాబురావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


