ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
మొగుళ్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఆమె పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను తీసుకొని నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అన్ని విధాలుగా తోడ్పడుతుందన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఎంజేపి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న మెనూను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ లక్ష్యంతో కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకి విద్య ప్రాముఖ్యతను వివరించారు. స్టాక్ రూం, డైనింగ్‌హాల్‌ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీఓ సురేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ శారద, పంచాయతీ కార్యదర్శి నరేష్ ఉన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి


