
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం
కాటారం: కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం చేకూరుతుందని పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం బీసీల రిజర్వేషన్ అమలుకు కేబినెట్ శ్రీకారం చుట్టిందన్నారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని భావించి కాంగ్రెస్ బలహీన వర్గాల హక్కుల సాధన కోసం కృషి చేస్తుందన్నారు. ఎన్ని కుట్రలు పన్నిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు చిటూరి మహేశ్, నాయకులు జాడి మహేశ్వరీ, నాయిని శ్రీనివాస్, తెప్పెల దేవేందర్‌రెడ్డి, అంగజాల అశోక్, కొట్టె ప్రభాకర్, నవీన్‌రావు, దబ్బెట రాజేశ్, కుంభం రమేశ్‌రెడ్డి, దబ్బెట స్వామి, భూపెల్లి రాజు, అయిత శకుంతల, కుమార్‌యాదవ్, చీర్ల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.