కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న చిరుతల రామాయణం శనివారంతో ముగిసింది. పల్లెల్లో పౌరాణిక నాటకాలు, ప్రదర్శనలు అంతరించిపోతున్న తరుణంలో పల్లె వాతావరణంలో రామాయణ ఘట్టంలోని పాత్రలకు తగిన వేషాలను వేసుకొని ప్రదర్శనను గ్రామస్తులు నిర్వహించారు. రామ,లక్ష్మణులు లంకలో దాడిచేసి రావణాసురుడిని హతమార్చి లంకలో ఉన్న సీతను తీసుకొచ్చిన సన్నివేశాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక ఘట్టం నిర్వహించారు. ఈ సన్నివేశాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలు వారు మద్దులపల్లికి తరలివచ్చారు.