
ఈ నెల 16న సీజ్ చేసిన టేకుమట్లలోని వైన్‌షాపు
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్స్‌లపై కొరడా
● 16 నెలల్లో 22 షాపులపై చర్యలు
● అధిక ధర, మద్యంలో నీళ్లు కలపడం, రిజిస్టర్లు సక్రమంగా రాయకపోవడమే కారణం
● విచ్చలవిడిగా బెల్టుషాపులకు సరఫరా
భూపాలపల్లి: నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్‌షాపు యజమానులపై ఎకై ్సజ్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం, రిజిస్టర్లు సరిగా రాయని, ఒక షాపులోని మద్యాన్ని మరోషాపులో విక్రయిస్తున్న వైన్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పలు వైన్స్ యజమానులు తమ దందాను వీడటం లేదు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 60 వైన్‌షాపులు ఉన్నాయి. 2021 డిసెంబర్–2023 నవంబర్ కాల పరిమితితో ఈ షాపులు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్‌షాపులపై ఎకై ్సజ్ అధికారులు తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ఎకై ్సజ్ అధికారులు, స్టేట్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) టీం అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గడిచిన 16 నెలల్లో 22 షాపులపై కేసులు నమోదు చేశారు. అందులో లూజ్ సేల్, మద్యంలో నీళ్లు కలపడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వైన్స్‌లను సీజ్ చేశారు. ఇతర నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు జరిమానా విధించారు.
పలుచోట్ల మారని తీరు..
ఎకై ్సజ్ అధికారులు దాడులతో దూకుడు పెంచినప్పటికీ రెండు జిల్లాల్లోని పలు పాపుల యజమానులు మాత్రం దందాను ఆపడం లేదు. ఇంకా యథేచ్ఛగా బెల్ట్‌షాపులకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ నెల 19న కాటారంలోని ఓ వైన్స్‌లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, అన్ని బ్రాండ్‌ల మద్యం అమ్మడం లేదని, బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారంటూ పలువురు ఆందోళన చేపట్టారు. టేకుమట్ల మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారనే కారణంతో అధికారులు ఈ నెల 16న షాపును సీజ్ చేశారు. అయినప్పటికీ అక్కడ బెల్ట్ దందా ఆగడం లేదు. పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే పదుల సంఖ్యలో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. రేగొండలోని ఓ వైన్‌షాపును పూర్తిగా బెల్టుషాపులకే పరిమితం చేసినట్లు సమాచారం. ఆ షాపులో మందుబాబులకు మద్యం విక్రయించకుండా, ట్రాలీల్లో బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తప్పవు..
రెండు జిల్లాల్లో నిత్యం దాడులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే చాలా షాపులపై కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు.
– శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
●
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కేసుల నమోదు వివరాలు..