కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంపుహౌస్‌లో రెండు మోటార్లతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండు మోటార్లతో ఎత్తిపోయగా డెలివరి సిస్టర్న్ వద్ద నాలుగు పంపులతో నీరు గ్రావిటీ కాల్వ ద్వారా తరలిపోతోంది. లక్ష్మీపంపుహౌస్‌లో రెండు మోటార్లు 4,236 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నాయి. ప్రాణహిత నది ద్వారా ఇన్‌ఫ్లో 3,240 క్యూసెక్కుల నీరు తరలివస్తోంది. దీంతో లక్ష్మీబ్యారేజీ వద్ద గేట్లు అన్ని మూసి వేయగా 16.17టీఎంసీల పూర్తి సామర్ధ్యానికి 4.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది.