మెజారిటీలో తగ్గేదేలే!
● భారీ మెజారిటీతో గెలుపొందిన
అర్జుల జ్యోతి మదుసూదన్‌రెడ్డి
తరిగొప్పుల: మండలకేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి అర్జుల జ్యోతిమధుసూదన్‌రెడ్డి 1,545 ఓట్ల మెజారిటీతో సమీప బీఆర్‌ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ఏదునూరి శివరాణి నర్సింహులపై గెలుపొందారు. గ్రామంలో 4,313 ఓట్లు ఉండగా 3,595 ఓట్లు పోలవగా అర్జుల జ్యోతికి 2133 ఓట్లు, ఏదునూరి శివరాణికి 588 ఓట్లు వచ్చాయి.
ప్రత్యర్థులు..ఒకేచోట
జనగామ రూరల్: మండలంలోని గానుగుపహడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురు మహిళలే బరిలో ఉన్నారు. ఆదివారం తమను గెలిపించాలని ఒక వైపు ముమ్మర ప్రచారం చేపట్టి తమ ఓటు వినయోగించుకోవడానికి వచ్చి ముగ్గురు అభ్యర్థులు దాసరి అనూష, కన్నెబోయిన భాగ్యమ్మ, తుపాకుల రాజేశ్వరీ పోలింగ్ కేంద్రం వద్ద ఒక్క దగ్గర కూర్చున్నారు. చూసేవారు గ్రామస్తులకే పోటీ ఉంది. తమకే పోటీ లేదు అన్నట్లు కూర్చున్నారు.
మెజారిటీలో తగ్గేదేలే!


