‘అఖండజ్యోతి’ పోస్టర్ ఆవిష్కరణ
పాలకుర్తి టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 5న(బుధవారం) కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ఉత్సవాల పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన నివాసంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దక్షణి భారతదేశంలో మూడో అఖండజ్యోతిని శ్రీసోమేశ్వర క్షేత్రంలో క్షీరాద్రి శిఖరంపై వెలిగించనున్నామని, భారీగా భక్తులు దర్శించుకోవాలన్నారు. ఈవో సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్‌శర్మ, సిబ్బంది రమేశ్, ఓంప్రకాశ్ పాల్గొన్నారు.
పటేల్ ఆశయసాధనకు మోదీ కృషి
జనగామ రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, బుడుగుల రమేశ్, శశిధర్‌రెడ్డి, ఉమారాణి, నందిరెడ్డి, నవీన్ రెడ్డి, కొంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యకర జీవనశైలి
పాటించాలి
రఘునాథపల్లి: ఆరోగ్యకర జీవనశైలి పాటించాలని, ఆరోగ్య పరీక్షలు అందరికీ ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఖిలాషాపూర్‌లో హైదరాబాద్ రామంతాపూర్, ప్రభుత్వ హోమియో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వయోమిత్ర హోమియా ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యులు గీతారెడ్డి, మమత, కమలహాసన్, స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్‌కిషన్, డీపీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ: మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అందరి ఆదరాభిమానాలతోనే తనకు గుర్తింపు వచ్చిందని డీపీఆర్‌ఓ(జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి) శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని టీఎన్జీఓ కార్యాలయంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు కన్నా పర్శరాములు అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, అధికారులు, కలెక్టర్లు అందించిన సహకారం ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. అనంతరం శ్రీనివాసరావు దంపతులను జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.
‘అఖండజ్యోతి’ పోస్టర్ ఆవిష్కరణ
‘అఖండజ్యోతి’ పోస్టర్ ఆవిష్కరణ
‘అఖండజ్యోతి’ పోస్టర్ ఆవిష్కరణ


