బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
రఘునాథపల్లి: వాగుల ఉధృతి సమయంలో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఇబ్రహీంపూర్, భాంజీపేట వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా వరద ప్రవాహానికి ఇబ్రహీంపూర్, భాంజీపేటలో దెబ్బతిన్న రోడ్డు, కాజ్‌వేలను ఆయన శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ 10 కోట్లు అవసరమని,, వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు వరి పంటలు పాడయ్యాయని అయా గ్రామాల్లో పలువురు బాధిత రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మాజీ సర్పంచ్‌లు కాసర్ల లక్ష్మయ్య, గ్యార అయిలయ్య, కాంగ్రెస్ నాయకులు పోకల శ్రీనివాస్, మేకల నరేందర్, తోటకూరి రమేష్, షబ్బీర్, గొరిగ రవి తదితరులు పాల్గొన్నారు.
మాధారం వాగుపై బ్రిడ్జి నిర్మించండి
మండలంలోని మాధారం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని అయా గ్రామస్తులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ సర్పంచ్‌లు గుడి రాంరెడ్డి, అరూరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పేదల బతుకుల్లో వెలుగులు
పేదల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే కడియం అన్నారు. ఇందిర 41 వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి


