మిన్నంటిన రోదనలు.. | - | Sakshi
Sakshi News home page

మిన్నంటిన రోదనలు..

Nov 1 2025 7:56 AM | Updated on Nov 1 2025 7:58 AM

ఎంజీఎం/ కురవి : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారితోపాటు చికిత్స పొందుతున్న వా రిని చూసి గుండెలవిసేలా రోదించారు. హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి పెళ్లి వాహన్నాన్ని (బొలెరో) బోర్‌వెల్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు రెడ్డబోయిన స్వప్న(15) అక్కడికక్కడే, రెడ్డబోయిన కళమ్మ(55), శ్రీనాథ్‌ (7) ఎంజీఎంలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మిగతా 20 మందిలో 10మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని ఎంజీఎం తీసుకొచ్చారు. ఇందులో వృద్ధురాలు అనసూర్య, చిన్నారులు శివకుమా ర్‌, అక్షిత, సంజన, మారుతి చికిత్స పొందుతున్నా రు. మరో ఐదుగురు క్షతగాత్రులు ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. దీంతో బాధితులు ఎంజీఎం ఆస్పత్రిలో తమ వారిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపించా రు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా పాలమాకుల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుటుంబం, మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన యువతితో కురవి లో మూడు రోజుల క్రితం వివాహం జరిపించారు. వధూవరులను తీసుకొని కుటుంబీకులు, బంధువులు బొలెరోలో తిరుగు ప్రయాణమయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో కొందరు వాహనం దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్‌వెల్‌ వ్యాన్‌.. బొలెరోను ఢీకొంది. ఈ ఘటనలో స్వప్న అక్కడిక్కడే మృతి చెందగా, కళమ్మ, శ్రీనాథ్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురు క్షతగ్రాతులు ఎంజీఎంలో, మరో ఐదుగురు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యాయం చేయాలని ధర్నా..

తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ క్షతగాత్రుల బంధుమిత్రులు ఎంజీఎం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయానికి అక్కడికి చేరుకున్న డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్‌కు ఘటనను వివరించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతర ఎమ్మెల్యే.. వరంగల్‌ ఏసీపీ శుభ్రం ప్రకాశ్‌నారేతో కలిసి పోస్టుమార్టం గది ఉన్న మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రోడ్డు ప్రమాద మృతులకు

ఎంజీఎంలో పోస్టుమార్టం

చికిత్స పొందుతున్న ఐదుగురు

గుండెలవిసేలా రోదించిన బాధితులు

న్యాయం చేయాలని ఆందోళన

పరామర్శించిన వరంగల్‌ పోలీసు కమిషనర్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే

క్షతగాత్రులను పరామర్శించిన

వరంగల్‌ పోలీసు కమిషనర్‌..

వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

మిన్నంటిన రోదనలు..1
1/2

మిన్నంటిన రోదనలు..

మిన్నంటిన రోదనలు..2
2/2

మిన్నంటిన రోదనలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement