పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు
మహబూబాబాద్ రూరల్ : పోక్సో కేసులో నేరం రుజువుకావడంతో ఓ యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి టి.దేవా కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2018 నవంబర్ 1వతేదీన రాత్రి 10 గంటలకు కనిపించకుండా పోయింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఏఎస్సై వెంకటాద్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా విచారణ అధికారులుగా అప్పటి ఎస్సై బి.సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐలు లింగయ్య, వెంకటరత్నం విచారణ అధికారులుగా వ్యవహరించారు. అప్పటి రూరల్ సీఐ జె.వెంకటరత్నం.. బాలిక కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి కేసముద్రం మండలం కల్వల శివారు వెంకట్రాం తండాకు చెందిన భూక్య శ్రీనును అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ నరేశ్ కుమార్ విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షులను ప్రస్తుత డీఎస్పీ ఎన్.తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ పి.సర్వయ్య, కోర్టు లైజనింగ్ అధికారి, ఎస్సై జీనత్ బ్రీఫింగ్ ఇవ్వగా ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారులు అశోక్ రెడ్డి, దేవా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటయ్య వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ.. శ్రీనుకు 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
పనికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు..
● మొక్కజొన్న మిషన్ ట్రాలీ స్టాండ్
పైనుంచి పడి ఇద్దరు కూలీలు మృతి
● ఏనుగల్లు శివారులో ఘటన
పర్వతగిరి: పనికి వెళ్లొస్తూ ఇద్దరు కూలీలు తిరిగిరాని లోకాలకు చేరారు. మొక్కజొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు మాల్య తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కథనం ప్రకారం.. మండలంలోని పంచరాయితండాకు చెందిన బానోత్ రాములు(57), బానోత్ హర్లా(48)తోపాటు మరికొంతమంది కూలీలు మొక్కజొన్న మిషన్‌లో పని చేయడానికి ఏనుగల్ వెళ్లారు. పని పూర్తయిన అనంతరం అదే ట్రాక్టర్(నెంబర్ ప్లేట్ లేని)కు అమర్చిన మొక్క జొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్‌పై రాములు, హర్లా కూర్చున్నారు. ఈ క్రమంలో మాల్యాతండాకు చేరుకోగా ట్రాక్టర్‌కు ఉన్న బోల్డ్ ఊడడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన హర్లా అక్కడికక్కడే మృతి చెందాడు. రాములును హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై రాములు కుమారుడు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైప్రవీణ్ తెలిపారు.
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, తెలుగు సినీ దర్శకుడు వంగ సందీప్‌రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు భద్రకాళి శేషు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావులు.. దర్శకుడు సందీప్‌రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సాయంత్రం దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది.
పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు
పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు


