విజిలెన్స్ అధికారులకు సహకరించాలి
హన్మకొండ: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అక్టోబర్ 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, పౌరులు తమ బాధ్యతగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సహకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలో అవకతవకలు, అవినీతి జరిగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు ఉదయం 6గంటలకు హనుమకొండ జేఎన్‌ఎస్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాక్‌థాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొలని పిలుపునిచ్చారు. అనంతరం అధికా రులతో ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్‌స్పెక్టర్లు బి.అనిల్‌కుమార్, కిశోర్, ట్రాన్స్ కోఇన్‌స్పెక్టర్ ఎం.డి.షాదుల్లా, ఏఓ ఎ.శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ ఎ.గౌతం, తహసీల్దార్లు లక్ష్మణ్, భాస్కర్, ఇంజనీర్లు విద్య, శ్రీనివాస్ నాయక్, మల్సూర్, యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ ఆఫీసర్ కార్తీక్, టీజీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్‌కో, కేటీపీఎస్, సివిల్ సప్లై, జీడబ్ల్యూఎంసీ, అటవీ శాఖ, డీసీసీ, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఏపీజీవీబీ, రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ
శ్రీనివాస్ రావు


