మోంథా విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

మోంథా విధ్వంసం

Oct 31 2025 7:32 AM | Updated on Oct 31 2025 7:32 AM

మోంథా

మోంథా విధ్వంసం

జిల్లాలో దాదాపు 25,796 ఎకరాల్లో పంట నష్టం రూ.80.47కోట్ల మేర నష్టం 13 గంటల రికార్డు వర్షం

రాకపోకలకు అంతరాయం

– మరిన్ని వార్తలు, ఫొటోలు 8,9లోu

నష్టం మరింత పెరిగే

అవకాశం

పొంగిపొర్లుతున్న

చెరువులు, వాగులు

48 ఇళ్లకు పాక్షికంగా నష్టం, జీవాల మృత్యువాత

రూ.80కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా

జనగామ: మోంథా తుపాను ప్రభావం జిల్లాను కోలుకులేని దెబ్బతీసింది. కోత, సేకరణకు సిద్ధమైన వరి, పత్తి పంటలు వర్షపునీటిలో మునిగిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. తడిసి తేమ పెరిగిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా, వాతావరణం సహకరించడం లేదు. రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట ఒక్క వర్షంతో వరణుడి పాలైంది.

మోంథా ప్రభావంతో జరిగిన నష్టాన్ని వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు తదితర శాఖల అధికారులు అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట నష్టం, కూలిన ఇళ్లు, రోడ్ల దెబ్బతినడం వంటి అంశాలపై అధికార బృందాలు సర్వే చేపట్టారు. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, ఇళ్లు, రోడ్లు, జీవాలు, చెరువు కట్టలు తదితర వాటిని కలుపుకుని సుమారు రూ.81 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమిక రిపోర్టు తయారు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందులో 10 మండలాల పరిధిలో 48 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 5 పశువులు, 10వేల కోడి పిల్లలు, 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 6,416 ఎకరాల్లో పత్తి, 10,131 ఎకరాల్లో వరి, 249 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 69చోట్ల రోడ్లు కోతకు గురికాగా, 9 చెరువుల పరిధిలో కోత, బుంగలు పడ్డాయి. ప్రభుత్వం రైతులు, బాధిత కుటుంబాలకు తక్షణం పంటబీమా, ఆర్థిక సాయం అందించాలని ఆయా రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మోంథా తుపాను ప్రభావంతో జనగామ చరిత్రలోనే అత్యంత భారీ వర్షాన్ని చవిచూసింది. మొత్తం 13 గంటల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షం పట్టణంతో పాటు 12 మండలాలను జలమయంగా మార్చేసింది. హైదరాబాద్‌ ప్రధాన రహదారిని ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో పక్కనున్న కాలనీలు నీటితో నిండిపోయాయి. ఆగకుండా కురిసిన వర్షంతో జిల్లాలోని పలుగ్రామాల్లో పెంకుటిల్లు పాక్షికంగా, పూర్తిగా కూలిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న వస్తువులు నీటిలో తడిసిపోయి, పాడైపోవడంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో వ ర్షాలతో చేపలు కొట్టుకుపోయిన పరిస్థితిలో మత్స్య కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా రహదారులు, కల్వర్టులు నీటి ము నిగిపోయాయి. వాగులపై నీటి ప్రవాహం తగ్గకపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నేటికీ పునరుద్ధరణ కాలేదు. బచ్చన్నపేట, జనగామ, నర్మెట, రఘునాథపల్లి, లింగాలఘణపురం, పాలకుర్తి, జఫర్‌గఢ్‌ మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారింది.

మోంథా విధ్వంసం1
1/2

మోంథా విధ్వంసం

మోంథా విధ్వంసం2
2/2

మోంథా విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement