
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు కానుగంటి రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం యూఎస్‌పీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టరేట్ ఏఏఓ సరస్వతికి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పీఆర్సీని ప్రకటించి పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించా లని, లేదంటే 23న రాష్ట్ర స్థాయి ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమి టీ నాయకులు చంద్రశేఖర్ రావు, ఎన్‌ఎన్ రాజు, షరీఫ్, సత్తయ్య, మడూరి వెంకటేష్, అంకుషావలి, ఇ ప్ప రాంరెడ్డి, శాడ రవి, శ్రీనివాసరావు, కుర్రెముల యాదగిరి గౌడ్, కళావతి, మంగు జయ ప్రకాష్, చిక్కు డు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం
అందజేస్తున్న ఉపాధ్యాయులు