
ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా స్టేషన్‌ఘన్‌పూర్ మోడల్ స్కూల్
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ ఈ విద్యా సంవత్సరం జిల్లాలో ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై న ట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా వివిధ పీఎంశ్రీ పథకాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఎంపికై నట్లు తెలిపారు. దీనిని పురస్కరించుకుని ఈనె ల 29న జాతీయ నూతన విద్యాదినోత్సవం సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
బహిరంగ సభను
విజయవంతం చేయాలి
రఘునాథపల్లి : సిద్దిపేట జిల్లా కేంద్రంలో నేడు (సోమవారం) నిర్వహించనున్న కార్మికుల బహిరంగ సభను విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రాసమల్ల కొమురయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో సంఘం నాయకులతో కలిసి వాల్‌పోస్టర్లు గోడలకు అంటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యల సాధనకు చేపట్టిన బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి సింగపురం భిక్షపతి, పోకల శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
జనగామరూరల్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని శామీర్‌పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇళ్లు లేని పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో అర్హులైన పేదలందరికీ ఇళ్లు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బనుక భిక్షపతి, జినుకల మల్లయ్య, కడమంచి వీరమల్లు, మేకల రామకృష్ణ, తెల్జీరు రాజు, అంజనేయులు, కృష్ణ, కనకరాజు, పాషా, సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
రేపు లక్ష్మీనారాయణస్వామి కల్యాణం
జనగామ: యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం (కై లాసపురం) పుణ్యక్షేత్రంలో ఈ నెల 29న ల క్ష్మీనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం ని ర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షు డు, వాసవీ ఉపాసకులు, ఐవీఎఫ్ థార్మిక పరి షత్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి. అంజయ్య స్వా మి తెలిపారు. ఆదివారం ఆయన జనగామలో మాట్లాడుతూ కల్యాణ మహోత్సవంతో పాటు గౌరీ, రేణుక, వాసవీ మాతలకు లక్ష కుంకుమార్చన పూజలు జరుగనున్నాయన్నారు.
హమ్మయ్య!
జనగామ: బంగాళాఖాతంలో అల్పపీడన ప్ర భావంతో వారంరోజులుగా కురుస్తున్న ముసు రు వర్షంతో సూర్య భగవానుడు మేఘాల చాటున కనిపించకుండా పోయాడు. అప్పటి వరకు దంచికొట్టిన ఎండలతో అల్లాడి పోయిన ప్రజలు.. వరుస వర్షాలతో గజగజవణికి పోయారు. వారం రోజుల తర్వాత ముసురు వర్షం మాయమై... ఆదివారం ప్రత్యక్షమైన సూర్యుడిని చూసిన వారంతా హమ్మయ్య అంటూ ఎండ వచ్చిందంటూ సంతృప్తి పొందారు. జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఓ మాదిరిగా దంచి కొట్టింది.
రేపటి నుంచి
ఉచిత కంటి వైద్య శిబిరం
జనగామ: పట్టణంలోని సిద్ధిపేట రోడ్డు రమాదేవి ఫంక్షన్‌హాల్‌లో శంకర నేత్రాలయ మేసు, హైదరాబాద్, నెల్లుట్ల ఉమారాణి, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఉచిత కంటిపొర చికిత్స శిబిరం నిర్వహించినున్నట్లు ఆదివారం నిర్వాహకులు తెలిపారు. కంటి శుక్లం ఉన్న వారికి వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 709517 5251 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా స్టేషన్‌ఘన్‌పూర్ మోడల్ స్కూల్

ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా స్టేషన్‌ఘన్‌పూర్ మోడల్ స్కూల్