
మోస్తరు వర్షానికే.. మస్తు కష్టాలు
జనగామ: జనగామ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. హైదరాబాద్, హనుమకొండ రోడ్లు బురదమయంగా మారాయి. జ్యోతినగర్ రూట్‌లో కొత్తగా నిర్మిస్తున్న కాలువ కోతకు గురవడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోయే స్థితికి చేరింది. విషయం తెలుసుకున్న ఎన్‌పీడీసీఎల్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. జనగామ–సిద్దిపేట ప్రధాన రహదారి చంపక్‌హిల్స్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ పనుల వద్ద పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో రాత్రి కురిసిన వర్షంతో చమన్, కుర్మవాడ, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో వరద నీటితో కాలనీల ప్రజలు ఇబ్బంది పడ్డారు.