
సాగు నీరివ్వకపోతే ప్రజాభవన్‌ను ముట్టడిస్తాం
పాలకుర్తి టౌన్: పాలకుర్తి ప్రాంతానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి పాలకుర్తి ప్రాంతానికి సాగునీరందించకుంటే ప్రజా భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీ ల్దార్ నాగేశ్వరచారికి అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సోమసత్యం, శ్రీలత, ముస్కు ఇంద్రరెడ్డి, గడ్డి సమ్మయ్య, గజ్జి శ్రీనివాస్, బెల్లి వెంకన్న, కౌడగాని మల్లేశ్, రైతులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్, మల్లన్నగండి రిజర్వాయర్ల ద్వారా చెరువులు, కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ డీఎస్ వెంకన్నకు వినతి పత్రం అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం నాయ కులు రాపర్తి సోమయ్య, కత్తుల రాజు, లింగబోయి న కుమారస్వామి, మంద మొగిలి, అశోక్, మల్ల య్య, లింగయ్య, వి.రాజు, ఉప్పలయ్య ఉన్నారు.
తెలంగాణ రైతు సంఘం నాయకులు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా