
ఘనంగా మహంకాళి విగ్రహ ప్రతిష్ఠాపన
● హాజరైన ఎంపీ కడియం కావ్య,
ఎమ్మెల్యే శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని సముద్రాల గ్రామంలో శ్రీమహంకాళి అమ్మవారు, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనో త్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, నిర్మాణకర్త కుందూరు సోమిరెడ్డి, నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎంపీకి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ధర్మకర్త సోమిరెడ్డికి, ఆలయ నిర్మాణానికి నిధుల కేటాయించిన ఎంపీ కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో సముద్రాల గ్రామపరిధిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగమణి, సోమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇనుగాల లలితాదేవి, గుండె విమలనర్సయ్య, కుమారస్వామి, నాయకులు భాస్కుల కిరణ్, రాజు, నారాయణ, హరిప్రసాద్, రవీందర్, రాజు, నర్సింహులు, కిషన్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.