
దేశం గర్వించేలా పాకిస్తాన్‌తో పోరాడాం
జనగామ రూరల్: పహల్గాం ఉగ్రదాడికి బదులుగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైనికులు దేశం గర్వించేలా పాకిస్తాన్‌తో పోరాడడం గొప్ప విషయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని స్మరించుకుంటూ సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో జనగామ రైల్వేస్టేషన్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ రాజేందర్ మాట్లాడుతూ.. భరతమాత నుదిటి మీద తిలకం తుడిచిన వారిని మట్టు పెట్టడానికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో చాలా మంది తప్పుడు ప్రచారం చేసినా.. మోదీ భయపడలేదన్నారు. దేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువు స్థానానికి తీసుకువెళ్తున్నారని వివరించారు. కాజీపేట రైల్వేస్టేషన్‌కు కోచ్ ఫ్యాక్టరీ రాబోతుందని, జనగామ రైల్వేస్టేషన్‌ను రూ.26 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ నంద రెడ్డి, మాజీ ఎంపీ గుండె విజయరామారావు, ఆరుట్ల దశమంత్ రెడ్డి, ఉడుగుల రమేష్, కేవీఎల్‌ఎన్.రెడ్డి, శివరాజ్, కత్తుల లక్ష్మి, దేవరాయ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కోసం పని చేస్తున్న మోదీ
ఎంపీ ఈటల రాజేందర్