
రాణి రుద్రమ పౌరుషాన్ని దెబ్బతీశారు
జనగామ: సుందరీమనుల కాళ్లు కడగడం క్షమించరాని నేరం.. సమ్మక్క–సారక్క స్ఫూర్తి, రాణి రుద్రమదేవి పౌరుషాన్ని దెబ్బతీశారని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, నన్ను కోసుకుతిన్నా పైసా లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు కోట్లు కుమ్మరించడంపై విమర్శించారు. అందాలబామల కాళ్లు కడగడం తెలంగాణ మంత్రులు మన సంప్రదాయంగా సమర్థించ డం సరికాదని.. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు పుణ్యక్షేత్రాలను సందర్శించిన సమయంలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ మేధావులు ఎక్కడ పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐరన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్నాడని, నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ఆరు కిలోల బియ్యం పంపిణీకి 60 మంది పోలీసులను కాపలా పెట్టుకు ని తిరిగే పరిస్థితిలో కడియం ఉన్నారని ఎద్దేవా చేశా రు. ఆయన తిన్నింటి వాసాలు లెక్కించే విధంగా కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని విమర్శిస్తున్నాడని అన్నారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, నాయకులు ఇర్రి రమణారెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమునలింగయ్య, బాల్దె సిద్ధి లింగం, మేకల కలింగరాజు, పగిడిపాటి సుధసుగుణా కర్‌రాజు, జూకంటి శ్రీశైలంలక్ష్మి, దయాకర్, కిష్టయ్య, మధు, స్వరూప, శారద, సదీప్, దేవునూరి సతీష్, గుర్రం నాగరాజు ఉన్నారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి