
సామరస్య పరిష్కారానికే మధ్యవర్తిత్వ కేంద్రాలు
రఘునాథపల్లి: కుటుంబ సభ్యులు, ఇతరులతో జరిగే చిన్న తగాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకే మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రం అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపూర్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సర్వజన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మీడియేటర్ మేకల శంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడు తూ.. జీవితం వెయ్యేళ్లు కాదుకదా.. ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.. గొడవలు, తగాదాలతో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగి సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. మధ్యవర్తిత్వ కేంద్రంలో సమస్యలు పరిష్కరించుకుంటే బంధాలు బలపడతాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మీడియేటర్ పెద్దమనిషిగా వివాదాలను స్వచ్ఛందంగా పరిష్కరిస్తారని చెప్పా రు. నిజామాబాద్, కరీంనగర్‌లో మధ్యవర్తిత్వ కేంద్రాలు విజయవంతంగా పని చేస్తున్నాయని, జిల్లాలో మొదట ఇబ్రహీంపూర్‌లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నరేష్, కమ్యూనిటీ మీడియేటర్లు ధర్మయ్య, కృష్ణారెడ్డి, రమేశ్, నర్సయ్య, వైష్ణవి గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు అంబీరు అరుణ, వీఓఏలు మౌనిక, వరలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్ రాజమణి, పరపతి సంఘం అధ్యక్షుడు మోర్తాల మహేందర్, మేకల శ్రీనివాస్, గాజులపాటి మైసారావు, దామెర వెంకన్న, బండ్ర రామచంద్రం, మేకల శ్రీనివాస్‌రెడ్డి, గాజులపాటి లక్ష్మయ్య,, దొరగొల్ల కుమార్, మల్లయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రం