
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం మండలంలోని గోవర్ధనగిరి, కుర్చపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా కాంటా వేసి బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పా రు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. ఓపీఎంఎస్‌లో రైతుల, ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. తహసీల్దార్ ఎండీ.మోహ్సిన్‌ముజ్తబ, సీసీలు రీనావతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా