
అభివృద్ధి పనులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: అదేపనిగా అసత్యపు ఆరోపణలు, విమర్శలు చేసే వారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌లో చేపట్టిన వంద పడకల ఆస్పత్రి, బంజారా భవన్ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరి శీలించారు. ముందుగా సంబంధిత శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించి అక్కడున్న అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న ఏడాదిలోపే సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి రూ.800 కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. కళ్ల ముందు అభివృద్ధి పనులు కనిపిస్తుంటే మాజీ ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు ఒక్కపైసా అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చే యడం సిగ్గుచేటన్నారు. పనులను చూసైనా కొందరికి జ్ఞానం రావడం లేదని విమర్శించారు. త్వరలో స్టేషన్‌ఘన్‌పూర్ రూపురేఖలు మారనున్నాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.70కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్‌రెడ్డి, కొలిపాక సతీష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, గిరిజన శాఖ జేఈ వినీల్, ఈఈ వీరభద్రం, డీఈ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి