విద్యుత్‌ వినతులపై ప్రత్యేక దృష్టి● | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వినతులపై ప్రత్యేక దృష్టి●

May 13 2025 1:10 AM | Updated on May 13 2025 1:10 AM

విద్యుత్‌ వినతులపై ప్రత్యేక దృష్టి●

విద్యుత్‌ వినతులపై ప్రత్యేక దృష్టి●

గ్రీవెన్స్‌లో ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌

జనగామ: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించడంతో పాటు వినతులపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌ తెలిపారు. సోమవారం జిల్లా పరిధి మండలాలతో పాటు సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించారు. 2024 జూన్‌ 17 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని.. 426 ఫిర్యాదులు రాగా 361 పరిష్కరించినట్లు చెప్పారు. ప్రతీ సోమవారం డివిజన్‌, ఈఆర్వో, సబ్‌డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సర్కిల్‌ ఆఫీస్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తామని చెప్పారు. గ్రీవెన్స్‌ నిర్వహించే రోజు ఉద్యోగులు అందుబాటులో ఉండి వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement