జనగామ: పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బతుకమ్మకుంట, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏరియా లేబర్ ఆఫీస్, చీటకోడూరులో జరుగుతున్న ఇంట్రా పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీ లించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్‌కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు.
‘నైటింగేల్’కు నివాళి
జనగామ: చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. వైద్య రంగంలో నర్సు వృత్తికి గౌరవం తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు 31 వరకు పొడిగింపు
జనగామ: ప్రభుత్వం అందించే 25 శాతం రా యితో ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్) చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకా శం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రెండు సార్లు అవకాశం ఇవ్వగా.. గడువు ముగిసినప్పటికీ.. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించింది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సి పాలిటీలతోపాటు మండలాల పరిధిలో ఇటీవ ల గడువు ముగిసే నాటికి 13,332 అప్లికేషన్ల ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి కాగా, రూ.24.67 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
‘గాలికుంటు’ నివారణే లక్ష్యం
లింగాలఘణపురం: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యమని వీబీఆర్‌ఐ(వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) మాని ట రింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి అన్నారు. సోమవారం రామచంద్రగూడెంలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ భద్రపరిచే కోల్డ్‌స్టోరే జీ, పశువైద్యశాలను సందర్శించారు.
అనంతరం మాట్లాడుతూ గాలికుంటు నివారణకు ఏటా రెండుసార్లు వ్యాక్సినేషన్ చేస్తున్నామని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. టీకా వేయకపోతే వ్యాధి సోకిన పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గడమే కాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ జిల్లాలో 1,35,000 పశువులు ఉండగా.. 87,779 పశువులకు టీకాలు వేశామన్నారు. ఉమ్మడి జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ నాగమణి, డాక్టర్లు నేహా, అనిత, భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి