
నేడే టీజీ పాలీసెట్
● జిల్లాలో మూడు సెంటర్లు
● అమలులో నిమిషం నిబంధన
జనగామ: పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిష న్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(నేడు) నిర్వహించే టీజీ పాలీసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేటరోడ్డున ఉన్న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్‌రోడ్డులోని సెయింట్ మేరీ హైస్కూల్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంట ర్లు కేటాయించారు. మొత్తం 1,416 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచి సెంటర్‌లోకి అనుమతి స్తారు. సమయం 11 గంటలు కాగానే గేట్లు క్లోజ్ చేస్తారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టిపరి స్థితుల్లోనూ అనుమతించరని పరీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. హాల్ టికెట్‌పై ఫొటో లేకపోతే గెజిటెడ్‌తో సంతకం చేయించి ఆధార్ తీసుకు రావాల్సి ఉంటుందని, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కోఆర్డినేటర్ స్పష్టం చేశారు.
వ్యాయామంతో ఆరోగ్యం
పాలకుర్తి టౌన్: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీఐ జి.మహేదర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన 5కే రన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ఒత్తిడిలో పని చేస్తారని వ్యాయామంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు.