
తల్లి ఆసరా లేనిదే నడవలేడు..
జనగామ పట్టణం గ్రేయిన్ మార్కెట్ ఏరియాకు చెందిన రావుల సత్తెమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కాళ్లు చచ్చుపడ్డాయి. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా తల్లి ఆసరా లేకుండా నిలబడలేడు. ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా పింఛన్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నామని సత్తెమ్మ వాపోయింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. పింఛన్ మంజూరు చేస్తే కొంత ఆసరాగా ఉంటుందని సత్తెమ్మ కోరింది. నడవలేని కొడుకు ను తీసుకుని ఆమె కలెక్టరేట్‌కు వచ్చింది.
అర్హులకు అన్యాయం చేశారు..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులతో పాటు దివ్యాంగులకు అన్యాయం చేశారని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, గన్నోజు మధు, జోగు సురేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు పంపించిన జాబితాలో తన పేరు ఉన్నా ఫైనల్ నివేదికలో కనిపించ లేదని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నాడు.
భూమి కోసం
పదేళ్లుగా తిరుగుతున్న..
మాకు మండల కేంద్రంలో 62/8లో ఎకరం భూమి ఉంది. 2019 వరకు ఆన్‌లైన్‌లో తమ పేరు చూపించింది. ధరణి వచ్చిన తర్వాత 27 గుంటలు మాత్రమే కనిపిస్తోంది. సమస్య పరిష్కరించాలని పది సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను.
– ఏనుగుల శంకరయ్య, నర్మెట

తల్లి ఆసరా లేనిదే నడవలేడు..

తల్లి ఆసరా లేనిదే నడవలేడు..