
రోడ్డుపైనే సిట్టింగ్
● సోమేశ్వర ఆలయ పరిసరాల్లో
మందుబాబుల ఓపెన్ సిట్టింగ్
● పట్టించుకోని పోలీసులు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో మందుబాబు లు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. సోమేశ్వర ఆలయం, గిరిప్రదక్షిణ రోడ్డు, పంచగుళ్లు, ఆలయం ఘాట్‌రోడ్డు, పాల్కురికి సోమనాథుడి స్మృతివనం తదితర ప్రాంతాలు సాయంత్రం అయి తే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు రోడ్డుపై మందుబాబులు సిట్టింగ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలు జారీ చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న స్థానిక పోలీసులు మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు, మహిళలు కోరుతున్నారు.