
సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
జనగామ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని వ్యతిరేకిస్తూ జనగామ జర్నలిస్టులు నిరసన తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జనగామ జర్నలిస్టు సంఘాల ఆధర్యాన చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడు తూ.. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఏపీ పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీ సర్కారు తీరు మార్చుకోకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వాస్తవాలను వెలికి తీసి పత్రికల్లో రాస్తే కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి వేధించటం మానుకోవాని హితవు పలికారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలి స్టులు ఇర్రి మల్లారెడ్డి, సురిగల భిక్షపతి, శ్రీభాష్యం శేషాద్రి, హింగే మాధవరావు, భాస్కర్, బిట్ల మధు, బండి శ్రీనివాస్, ఉల్లెంగుల మనీ, కన్నారపు శివశంకర్, శశిధర్, నేతి ఉపేందర్, మహిపాల్‌రెడ్డి, గోవర్ధ నం వేణుగోపాల్, కేమెడి ఉపేందర్, చౌదరిపల్లి ఉపేందర్, యూసఫ్, పన్నీరు భానుచందర్, ఆశిష్, ఉపేందర్, మణికుమార్, బజాజ్, క్రాంతి, హరీష్, వినయ్, సాగర్, కిరణ్, నవీన్, ఓంకార్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.