
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
జనగామ రూరల్: కేంద్రం అవలంభించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాపర్తి రాజు, సుంచు విజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్‌లను తీసుకొస్తున్నారని, కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాల రాయబడ్డాయన్నారు. దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు, జోగు ప్రకాష్, మల్లేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.