
సకాలంలో లారీలను పంపించండి
● అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్
జనగామ రూరల్: సకాలంలో లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజ మహేంద్రనాయక్‌తో కలిసి ధాన్యం తరలింపుపై రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్స్‌తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులను సరైన విధంగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు, తదితర అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచాలని లారీ కాంట్రాక్టర్స్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్‌ఓ సరస్వతి, డీఎం సీఎస్ హాతీరాం, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, రైస్ మిల్ల ర్లు, లారీ కాంట్రాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.