సబ్‌స్టేషన్‌ సమీపంలో మంటలు | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌ సమీపంలో మంటలు

Apr 8 2025 7:35 AM | Updated on Apr 8 2025 7:35 AM

సబ్‌స్టేషన్‌ సమీపంలో మంటలు

సబ్‌స్టేషన్‌ సమీపంలో మంటలు

గాలి దుమారానికి ట్రిప్‌ అయిన విద్యుత్‌

నిప్పురవ్వలతో అంటుకున్న ఎండుగడ్డి

రఘునాథపల్లి: కంచనపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ ట్రిప్‌ అయింది. ఈ క్రమంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నిప్పు రవ్వలు కిందపడగా నేలపై ఉన్న ఎండు గడ్డికి అంటుకున్నాయి. ఆ మంటలు సబ్‌స్టేషన్‌ చుట్టూరా ఉన్న ఎండు గడ్డికి విస్తరించి చుట్టుముట్టాయి. అప్రమత్తమైన సిబ్బంది గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచా రం ఇవ్వగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఫైరింజన్‌ వచ్చే సరికి మంటలు పూర్తిగా చల్లారడంతో వెనుదిరిగారు. ఈ విషయమై విద్యుత్‌ ఏఈ రాహుల్‌ను వివరణ కోరగా సబ్‌స్టేషన్‌ చుట్టు పక్కలనే మంటలు వ్యాపించా యి.. సబ్‌స్టేషన్‌లో ఎలాంటి నష్టం జరగలేదు.. మంటలు తగ్గాక గ్రామంలో విద్యుత్‌ పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement