● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక ఈఆర్‌ఎల్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో కలెక్టర్ రిజ్వాన్‌బాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి నమాజ్ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ము స్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే గొ ప్ప పండుగ రంజాన్ అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి న ముస్లింలను ప్రోత్సహించేలా ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నా ణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. అనంతరం ముస్లింలు, ఇఫ్తార్ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేను, క లెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, ఏసీపీ భీమ్‌శర్మ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూ లుకుంట్ల శిరీష్‌రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.యాకుభ్‌పాషా, మత పెద్దలు మహమూద్‌అలీ, షేక్ జానీ, కలీమ్, ఎండీ.రహ్మతుల్లా, ఖదీర్‌కురేషి, ఫయాజ్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.