రఘునాథపల్లి: వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత అన్నారు. మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి సుజాత ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్‌లో ఆదివారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా తుమ్మలపల్లి సోమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా బచ్చు శ్రీనివాస్, కోశాధికారిగా పోకల హరిప్రసాద్‌తో పాటు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో సుజాత మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐక్యతగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కౌన్సిల్ సభ్యుడు పోకల శివకుమార్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద, జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు కూరెల్ల పెద్ద ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుజాత