ఈఆర్‌సీ చైర్మన్‌కు సమస్యలు విన్నవించిన వినియోగదారులు | - | Sakshi
Sakshi News home page

ఈఆర్‌సీ చైర్మన్‌కు సమస్యలు విన్నవించిన వినియోగదారులు

Mar 20 2025 1:28 AM | Updated on Mar 20 2025 1:27 AM

బహిరంగ విచారణకు అధ్యక్షత వహించిన ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్‌కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌కు సమస్యలు వివరించారు. వీరితో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమలకు విద్యుత్‌ టారిఫ్‌లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్‌కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్‌ ఇండస్ట్రీస్‌ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్‌గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్‌కు రూ.15 నుంచి 30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్‌ విద్యుత్‌ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్‌ వైర్‌ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్‌ లైన్‌లకు న్యూటల్‌ వైన్‌ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మద్యన ఉన్న డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను రోడ్డు సౌకర్యం ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచింతంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్‌లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్‌ లైన్‌మెన్లు, లైన్‌మెన్‌లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళలపై నుంచి వెళ్తున్న విద్యుత్‌ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌..టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డిని ఆదేశించారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్‌కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌కు వివరించారు. వీరితో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమలకు విద్యుత్‌ టారిఫ్‌లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్‌కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్‌ ఇండస్ట్రీస్‌ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్‌గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్‌కు రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్‌ విద్యుత్‌ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్‌ వైర్‌ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్‌ లైన్‌లకు న్యూటల్‌ ౖలైన్‌ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మధ్య ఉన్న డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచితంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్‌లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్‌ లైన్‌మెన్లు, లైన్‌మెన్‌లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్‌ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌..టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement