రంగప్ప చెరువులో కూల్చేసిన మట్టిని తీసుకొచ్చి నింపేస్తున్నారు. కాలనీ మీదుగా ట్రాక్టర్ల ద్వారా మట్టిని చెరువులోకి తీసుకొస్తూ.. కుంటను లెవల్ చేస్తున్నారు. వ రద నీరు వస్తే మేం ఎటెళ్లాలని అడిగితే సమాధానం చెప్పడం లేదు. ఉన్నతాధికారులు చెరువును పరిరక్షించి విచారణ జరిపించాలి. – సుధాకర్, గోకుల్‌నగర్, జనగామ
మట్టి నింపితే నీరంతా ఇళ్లలోకే..
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టిని నింపితే వర్షాకాలం, గోదావరి జలాలతో నింపిన సమయంలో ఆనీరంతా మా ఇళ్లలోకి వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినం. చెరువును పరిరక్షించడంతో పాటు మట్టి పోయకుండా చర్యలు తీసుకోవాలి. – ఎన్.ప్రభాకర్, గోకుల్‌నగర్, జనగామ
అధికారులు చర్య తీసుకోవాలి..