
దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
జనగామ: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ మెంబర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు జావాబు చెప్పలేక కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యల కు పాల్పడుతోందని అన్నారు. కేంద్రంలో నియంత పాలన కొనసాగుతోందని, మాట్లాడే గొంతును నొక్కి వేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.