
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం విష్ణుపురి గ్రామానికి చెందిన సుంకరి శశివర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న నూతన మూవీకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం క్లాప్ కొట్టి షూ టింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి ప్రాంతానికి చెందిన శశివర్మ గొప్ప దర్శకుడిగా ఎదిగి మంచి మంచి సినిమాలు తీయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.మదార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్, సర్పంచ్‌లు కుమార్, యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలి
జనగామ రూరల్: చదువుతో పాటు వివిధ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని చేర్యాల జాక్ చైర్మన్ చక్రధర్, జనగామ జాక్ కన్వీనర్ మంగళంపల్లి రాజు అన్నారు. క్రీడాకారులకు మద్దతుగా జాక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం ‘3కే రన్ ఫర్ జనగామ ఫ్యూచర్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ప్రజలు, యువత, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందడుగు వేయాలన్నారు. జిల్లాలో అనేక మంది జాతీ య, అంతర్జాతీయ క్రీడాకారులున్నారని, వారు ఆర్థికంగా నిలబడటానికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో జాక్ నాయకులు తుంగ కౌశిక్, మహ్మద్ అబ్బాస్, రుద్ర, అనూష, కార్తీక్, లఖన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రయల్ రన్
జనగామ: జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. సిద్దిపేట, వరంగల్, హైదరా బాద్, సూర్యాపేట రోడ్డు నలుదిక్కులా ఏర్పా టు చేసిన సిగ్నల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మూడేళ్ల తర్వాత సిగ్నల్ పునఃప్రారంభం కావడంతో వాహనదారులకు అవగా హన కలిగించేందుకు ట్రయల్ రన్ చేపట్టారు. జంక్షన్‌లో నాలుగు వైపులా జీబ్రా లైన్స్ ఏర్పా టు చేసిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా వరంగల్‌లోని చారిత్రక శ్రీభద్రకాళి దేవాలయంలో ఐదవ రోజు ఆదివారం చైత్రశుద్ధ పంచమి తిథి లక్ష్మీ పంచమిని పురస్కరించుకుని పసుపు రంగు చామంతి పూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యాహ్నికం చేపట్టారు. అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు చామంతి పూలకు సంప్రోక్షణ నిర్వహించి.. అమ్మవారికి లక్ష పుష్పార్చన చేశా రు. నగరానికి చెందిన ప్రముఖ అడ్వకేట్ భాస్కరవజ్జుల పురుషోత్తం, భవాని దంపతులు దాతలుగా వ్యవహరించారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణమూర్తి కుటుంబ సమేతంగా, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ శేషుభారతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


